TEST
ఉన్న కర్మనూ, శరీరములోనే ఉన్న మంత్రగాదైన మిస్టర్ X ను తెలిసీ, ఖాళీ అయిన కర్మసంచిని మిస్టర్ ౫ కు ఇచ్చిన రోజు నీకు మోక్షము లభించగలదు. అపుడు చనిపోయిన వానికి ఆ మరణము ఆఖరీ మరణము కాగలదు. అంతవరకు లోపలి వివరమూ విషయమూ తెలియనిదే, కర్మసంచిని మంత్రగానికి ఇవ్వనిదే _ నీకు ఎన్ని మార్లు మరణము వచ్చినా అది ఆఖరీ మరణము కాదు. ఆఖరీ మరణమంటే ఏమిటో ఇపుడు తెలిసింది. కొంతమంది స్వామిజీలు చనిపోయినపుడు మా గురువుగారు మోక్షము పొందాడని ఆ స్వామిజీ శిష్యులు అనుకోవడము జరుగుచున్నది. అపుడు చనిపోయిన ఆ స్వామోజీ ఆఖరీమరణము పొందాడని మనమనుకోవచ్చును. అలా అనుకోవడములో నిజము ఉండవచ్చును లేక అబద్దము ఉండవచ్చును. ఆఖరీ మరణము పొందని వానిని కూడ అతను మోక్షము పొందాడని పొరపాటుగ మనము అనుకోవచ్చును. నిజముగ ఆఖరీమరణము పొంది మోక్షము పోయిన వానిని పొరపాటుగ అతను మోక్షమును పొందలేదని కూడ అనుకోవచ్చును. ఇలాంటి గందరగోళము జరిగి, మరణించిన వారిలో ఎవరు మోక్షము పొందారో, ఎవరు పొందలేదో కూడ మనుషులకు తెలియకుండ పోవునని ఊహించిన భగవంతుడు, తన భగవద్గీతలో ఆఖరీ మరణమును గురించి అక్షర పరబ్రహ్మయోగమున చివరిలో 28వ శ్లోకమునుండి 28 శ్లోకము వరకు చెప్పాడు. మొదట 23వ శ్లోకములో ఏమి చెప్పాడని చూడగా ఇలా ఉంది. అధ్యాయము 8, శ్లోకము :23 యతకాలే త్వనాన్చుత్తి మావ్చత్తిం బైవ యోగిన 2/ టదయాతా యాన్తి తం కాలమ్ వ్ఞ్రామి భరతర్షభ / యోగులైన వారు ఎపుడు చనిపోతే తిరిగి పుట్టుధురో, ఎపుడు చనిపోతే తిరిగి పుట్టరో ఆ కాలమును గురించి చెప్పెదను వినుము. ఇపుడిది శాస్త్రబద్దమైన విషయముగా అందరూ గ్రహించాలి. భగవంతుడు చెప్పబోవు కాలమును తెలుసుకొన్న తర్వాత అపోహలకు ఏమాత్రము తావుండదు. ఎటువంటి వారి మరణమునైన భగవంతుడు చెప్పిన సమయముతో పోల్చి చూచి అది ఆఖరీ మరణమా కాదా, అని తేల్చి చెప్పుకోవచ్చును. పై శ్లోకములో “యోగిని అని ఈ కాలము యోగులకు మాత్రమే వర్తించునని చెప్పాడు. కావున యోగులైన వారిలో పూర్తి కర్మ అయిపోయిన వారెవరు? కర్మ అయిపోక ఇంకా మిగిలిన వారెవరని కూడ [గ్రహించవచ్చును. యజ్ఞయాగాదులు చేయువారు, వేద పఠనము చేయువారు, దానములు చేయువారు, తపస్సులు చేయువారు యోగులుకాదని, వారు జన్మకు తప్ప మోక్షముకు పోరని, అటువంటి వారిని చూడవలసిన పనేలేదని, గీతలోని విశ్వరూపసందర్శన యోగమునందు గల 48,53 శ్లోకముల ప్రకారము చెప్పవచ్చును. యజ్ఞ వేద, దాన, తపముల చేయు నాల్గు రకముల వారిని వదలి యోగులైన వారిలో కూడ కర్మ అయిపోక, ద్రైవర్ విడిపోక ఎవడు తిరిగి పుట్టునో, వానిది ఆఖరీ మరణముకాదనీ, ఎవని శరీరమును నడుపు డైవర్ వానిని వదలి పెట్టి పోవునో, ఎవని కర్మ పూర్తి అయిపోవునో అటువంటి యోగి పొందిన మరణము ఆఖరీ మరణమగునని తెలియాలి. ఆఖరీ మరణమును యోగులైన వారు కూడ ఏ సమయములో పొందుదురో గీతయందు అక్షర పరబ్రహ్మ భా (మేర

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home